మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
దీప శ్లోకం (దీపం జ్యోతిః పరబ్రహ్మ)
విశేషం: సంధ్యా సమయంలో దీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది.
దీపం శ్లోకం:
దీపం జ్యోతిః పరబ్రహ్మ
దీపం జ్యోతిర్జనార్దనః |
దీపో హరతు మే పాపం
సంధ్యా దీపం నమోస్తుతే ||
శ్లోకం - అర్థం (Meaning):
దీపం జ్యోతిః పరబ్రహ్మ: దీపం పరబ్రహ్మ స్వరూపం (పరమాత్మ రూపం).
దీపం జ్యోతిర్జనార్దనః: దీపం జనార్ధనుని (విష్ణుమూర్తి) స్వరూపం.
దీపో హరతు మే పాపం: అటువంటి దీపం నా పాపాలను హరించుగాక.
సంధ్యా దీపం నమోస్తుతే: సంధ్యా సమయంలో వెలిగించే దీప లక్ష్మికి నమస్కారం.
ప్రధాన భావం:
జ్ఞాన స్వరూపమైన దీపం అజ్ఞానమనే చీకటిని పోగొట్టి, పాపాలను నశింపజేసి, సకల శుభాలను ప్రసాదిస్తుందని, అటువంటి దీప లక్ష్మికి నమస్కరిస్తున్నాను.
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India..